వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లలేదని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. నేను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదన్నారు. వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా విశాఖలోని గంగవరం పోర్ట్ ద్వారా దిగుమతి…