JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాడిపత్రిలో తాజాగా, ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నా.. కానీ, ప్రభుత్వ పథకాలు రావడం లేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని కామెంట్స్ చేశారు.
మమ్మల్ని కలవ లేదని ఏరోజూ తెలుగు సినిమా నిర్మాతల్ని తాము ఇబ్బంది పెట్టలేదని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినీ ప్రముఖులు కలవలేదని తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? అని ప్రశ్నించారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందు ప్రపంచంలో థియేటర్లో బంధు అనే విషయం ఎందుకు బయటకు వచ్చిందన్నారు. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది స్పష్టమైన వైఖరి అని పేర్కొన్నారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు…
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఎఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు భోగాపురం విమానాశ్రయానికి ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం 1733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి విమానాశ్రయ…
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. నిన్న రాత్రి ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతని అన్న మరో ఇద్దరు కారుతో గుద్దారని తెలిపారు.
IAS, IPS Officers Transfer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో బదిలీల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారుల నిర్ధారించారు. ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు…
Minister Narayana: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జరిగిన కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడిస్తూ.. సీఆర్డీఏ 47వ ఆధారిటీతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగిందన్నారు. 2014- 19లో గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించి రూ. 514 కోట్ల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
AP Govt: గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. రూ. 1,410తో 11 వస్తువులను బేబీ కిట్ ద్వారా పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
గ్రామ వార్డ్ సచివాలయంలో కొత్త రేషన్ కార్డు కోసం వివరాలు నమోదు చేసుకోవాలి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల చెప్పారు. జూన్ లో అందరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
CM Chandrababu: దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు.