Auto Driver Seva Scheme: నేడే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ. 15 వేలు..
- నేడు ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం..
- సీఎం చంద్రబాబుతో పాటు కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్..
- ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto Driver Seva Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనుంది. అయితే, ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఈరోజు ( అక్టోబర్ 4న) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు.
Read Also: Laya : లయ ఫస్ట్ లుక్.. ‘నా కుటుంబం జోలికి వస్తే!’
Also Read
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
అయితే, 2.90 లక్షల మందికి లబ్ది చేకూరేలా ఏపీ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో సొంత ఆటో, క్యాబ్ లపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం రూ. 436 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇక, ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం కంటే.. అదనంగా రూ. 5 వేలను చంద్రబాబు సర్కార్ ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38, 576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20, 072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6, 400 మంది ఉన్నారు.
Read Also: Laya : లయ ఫస్ట్ లుక్.. ‘నా కుటుంబం జోలికి వస్తే!’
ఇక, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22, 955 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరగా.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే.. వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..