AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకై నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు అయింది. సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథిలు ఉన్నారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై ఈ కమిటీ ప్రధానంగా నిఘా పెట్టనుంది. అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై GoM అధ్యయనం చేయనుంది.
Read Also: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రేపు వీఐపీ దర్శనాలకు బ్రేక్..!
అయితే, తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై ఈ మంత్రుల కమిటీ చర్యలకు సిఫారసులు చేసే అవకాశం ఉంది. పౌర హక్కుల పరిరక్షణకు సైతం మంత్రుల కమిటీ సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం ఉంటుంది. సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి మంత్రుల కమిటీ సమర్పించనుంది. ఈ కమిటీ ఏర్పాటుతో సోషల్ మీడియా దుర్వినియోగం, తప్పుడు వార్తలు, మిస్ఇన్ఫర్మేషన్, ఇతర భద్రతా సమస్యలపై ప్రభుత్వం మరింత సమగ్ర చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంది.