CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, హెచ్వోడీలు, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటాలు లేవు.. గత ప్రభుత్వం ప్రశాంతమైన ప్రాంతాలను కూడా నేరమయం చేసింది.. నేరస్తులను పెంచి పోషించారు.. నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లను ఎప్పుడైనా చూశామా?.
ఏపీ మినిస్టర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమండ్రి పర్యటన ఒకసారి కాదు.. ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. లోకల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ సబ్జెక్ట్. ఎలాంటి బలమైన కారణం లేకుండా.. ఆ స్థాయి నాయకుడి పర్యటనను ఏకంగా మూడు సార్లు ఫిక్స్ చేసి వెంటనే ఎందుకు కేన్సిల్ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు గానీ, రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కొట్లాడారో చూశాం.. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు కొనుక్కొని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది.
నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ జరుగుతుంది.. అందులో ఎంతటి వారున్నా వదిలి పెట్టే సమస్య లేదన్నారు. అలాగే, మద్యం షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్ పెట్టాం.. బార్ కోడ్ స్కానింగ్ పెట్టిన తరువాత నకిలీ బాటిల్స్ బయట పడలేదని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ది, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు.
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, అక్టోబర్ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం.. ఇక టెండర్ల దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది సర్కార్.. తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. డీపీఆర్ టెండర్ల…
మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి చెప్పారు. అందరి ఆశీర్వాదంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025 గెలిచాం అని తెలిపారు. వరల్డ్‌కప్‌లో సమిష్టిగా రాణించాం అని, టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని, ముందు చాలా ఉందని తెలుగు తేజం శ్రీ చరణి చెప్పుకొచ్చారు. వన్డే ప్రపంచకప్‌లో శ్రీ చరణి సత్తా చాటిన విషయం తెలిసిందే.…