ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు ఆదేశించింది.
రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా.. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. అయితే, ఏబీని రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వుల్ని ఉన్నత న్యాయస్థానం సమర్దించింది.
జగన్ రెడ్డి కనుసన్నల్లో అయినవారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అడ్డగోలుగా లిస్ట్ తయారు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ వేశారన్నారు.
ఏపీ ఛీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డితో స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియషన్ సభ్యుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులపై చర్చ జరిగింది. పెండింగ్ నిధులు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్షీశా మాట్లాడారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై క్యాట్ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. రెండోసారి ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటం సరికాదని ఈ నెల8 న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాలను ప్రభుత్వం అప్పీల్ చేసింది.
గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ కోసలి అప్పారావు భ్రూణ హత్యలపై స్పందించారు. చెత్త కుండీలు కాలువలలో శివులను పడేయటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లలు వద్దనుకుంటే తమకి అప్పంగించ వచ్చని స్పష్టం చేశారు.