AP CM Review Meeting: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు.
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆర్డినెన్సుకు సర్కార్ ఆమోదం తీసుకుంది. ఇవాళ రాత్రికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది.
అంబేద్కర్ కోసం జిల్లా గంటి పెదపూడి పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు. అయితే, జగన్ ధర్నాకు పలు పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇస్తున్నారు.
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్దిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, స్కీంలకు సంబంధించిన బకాయిల లెక్కలే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు.
Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది..
Chandrababu: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఉన్న అప్పులు లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత…