Mithun Reddy: ప్రభుత్వ తీరుపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి..
- వైసీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు..
- పోలీసులు నన్ను హౌస్ అరెస్టున్నామని నోటీసులిచ్చారు..
- నేను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్దిలేని వారు ప్రచారం చేస్తున్నారు: మిథున్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mithun Reddy: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.. ఇళ్లులు కూల్చుతున్నారు.. మా వారిని పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారు.. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు.. పోలీసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారు.. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను అని ఆయన వెల్లడించారు. 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారు.. వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా.. అధికారం శాశ్వతం కాదు.. ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము.. మీరు వెళ్ళడానికి లేదు.. హౌస్ అరెస్టు చేస్తున్నాము.. అని నాకు నోటీస్ ఇచ్చారు.. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రలో తొలిరోజు బాబా బర్ఫానీని దర్శించుకున్న 13 వేల మంది భక్తులు
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఇక, నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న ఇలాంటివి ఎప్పుడు చేయలేవు.. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్నాను.. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకి వెళ్ళారు.. నేను అరెస్టు కైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి భద్ర పర్చుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారు అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!