ఏపీ ప్రభుత్వం మరో కొత్త పనికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండగా.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన సమాచాారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలోనూ రెవిన్యూ సదస్సులు పెడతామన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా.. చిన్న రెవిన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
Read Also: Vinod Kambli: దేవుడి దయతో అంత ఓకే.. వినోద్ కాంబ్లీ హెల్త్ అప్‌డేట్..
అంతేకాకుండా.. ఈ సదస్సుల్లో భూ ఆక్రమణలు, 22 ఏ భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలను స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి తహశీల్దారుతో పాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని మంత్రి అనగాని పేర్కొన్నారు. ప్రతి అర్జీని అన్లైన్ చేసి.. దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు.
Read Also: Ambati Rambabu: అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దాడి.. రాజ్యాంగంపై జరిగినట్లే