CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి నేతలు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైజాగ్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, అభ్యర్థి ఖరారు, ఎన్నికల్లో గెలుపుపై విశాఖ పట్నాంకు చెందిన నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కార్పోరేటర్లను తమ వైపుకు ఎన్డీయే కూటమి పార్టీలు తిప్పుకుంది. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. జనసేన పార్టీతో సమన్వయం చేసుకుంటూ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఢీ కొనాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే అంశాన్ని టీడీపీ అస్త్రంగా తీసుకోనుంది. స్థానిక సంస్థల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా సర్పంచులు, ఎంపీటీసీలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోరనుంది.