AP CM Review Meeting: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడడంతో భూ కేటాయింపులు జరిగిన తరువాత కూడా వెళ్లిపోయిన పలు కంపెనీలు.. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల దుర్వినియోగం అయ్యాయని అంగీకరించిన అధికారులు.. రాష్ట్రం విడిచిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Prabhas: టాలీవుడ్ లో ఒకే ఒక్కడు ఉప్పలపాటి ప్రభాస్..ఇంక ఎవరి వల్ల కాదు..
అలాగే, పారిశ్రామిక వేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత.. ఏఏ ప్రాంతాలు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కు అనుకూలం అనే అంశాలపై చర్చ కొనసాగుతుంది. రివ్యూ మీటింగ్ కు మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు సంబంధిత శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు.