నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ-జూనియర్ కళాశాలలు, మనుషుల అక్రమ…
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని వైఎస్ జగన్ అడిగారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడును ఇన్చార్జిగా నియమించారు. బదిలీ అయిన హర్షవర్ధన్ రాజును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. డీజీపీ రాజకీయ నేత లాగా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన క్రీడా విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
AP Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు.