రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని ప్రాసిక్యూషన్ చెప్పారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ…
AP News: గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అందుబాటులో లేని సంక్షేమ పథకాలు, రాయితీల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకాలలో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కీలకంగా భావిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, సీఎం చంద్రబాబు ఆమోదం పొందగానే వాటిని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.…
AP DGP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇ
కరెంటు బిల్లుల పెంపుతో కూటమి ప్రభుత్వం ప్రజల గూబలు గుయ్యమనిపించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు (వీఎస్సార్) ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కరెంటు బిల్లుల పెంపును ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అవుతోందన్నారు. అదానీతో విద్యుత్ ఒప్పందాన్ని, స్మార్ట్ మీటర్లుని రద్దు చేసుకోవాలి.. ఆంధ్రప్రదేశ్‌ను అధానాంద్రప్రదేశ్‌గా మార్చొద్దని వీఎస్సార్ కోరారు. వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… కరెంటు బిల్లుల పెంపుతో…
Collectors Conference: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగు, సాగునీటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ, ఏలాంటి సేవలు అందించడం లేదని పేర్కొన్నారు.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి (డిసెంబర్ 9) నుంచి రెండు రోజులు పాటు అధికారులు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు. రాష్ట్రంలో నకిలీ పెన్షన్ దారులను ఏరి వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి.. భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం…
రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం నాకు చాలా సార్లు చెప్పుకొచ్చారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం 1.92 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు కట్టాలని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది.