పోలీస్ శాఖలో ఏపీ ప్రభుత్వం కీలక బదిలీలను చేపట్టింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన ప్రభుత్వం… తాజాగా కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాష్‌ను కడప జైలర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు…
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రేపు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్… రేపు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయబోతున్నారు.. రాష్ట్రంలోని…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకు…
ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల…
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన నోట్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నోట్‌ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30వేల మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రానుంది. Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అటు రాష్ట్రంలో కొత్తగా…
ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం…
ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని గనుల శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖలో ఎవరైనా ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా.. బంద్ చేసినా.. ఆందోళనలకు దిగినా ఎస్మా చట్టం ప్రకారం…
ఏపీలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి చాలా ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆర్టీసీలో ఓ వర్గం ఉద్యోగులు మాత్రం తాము ఆందోళనల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశాయి. సీఎం జగన్ తమకు మంచే చేశారని… ఉద్యోగ సంఘాల ఉద్యమంలో తాము భాగం కాలేమని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది.…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం కనుచూపు మేర ఉద్యోగులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉద్యమంలోనూ ఇంతమంది పాల్గొన్న దాఖలాలు లేవు. పోలీసులు జిల్లాల్లోనే కొందరు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారు వేషాల్లో చలో విజయవాడకు ఉద్యోగులు తరలివచ్చారు. రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక…