ఏపీ సర్కార్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 3 ఏళ్లుగా కాన్వాయ్ డబ్బులు ప్రభుత్వం బాకీ పడడం రాష్ట్రానికి అవమానమన్న ఆయన.. కాన్వాయ్ కోసం కార్లు పెట్టిన వారికి ప్రభుత్వం రూ. 17 కోట్ల బాకీ పడడం సిగ్గుచేటన్నారు.. వ్యవస్థల పతనానికి ఇది నిదర్శనం.. ఆందోళనకరం అన్నారు. పాలకుల వైఫల్యం అధికారులను, ఉద్యోగులను కూడా ఒత్తిడిలోకి నెట్టేస్తుందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. సీఎం కాన్వాయికు కార్లు పెట్టిన…
పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ పీఆర్సీలో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పీఆర్సీ బకాయిలను ఇప్పటి వరకు PF, GPF ఖాతాల్లో జమ చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం రిటైర్మెంట్ తర్వాతే చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్ రికవరీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2020-డిసెంబర్ 2021 వరకు రావాల్సిన…
అసని తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీలో ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే తుఫాన్ కారణంగా ఈరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అధికారులు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను శుక్రవారం రోజే జమ చేయనున్నారు. కాగా గురువారం నాడు ఏపీ…
అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోయింది.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే, మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది ప్రభుత్వం.. పరిశ్రమలకు విద్యుత్ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా…
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర అధ్యక్షులు జానీ పాషా తెలిపారు. దీనికి సంబంధించి సోమవారం నాడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయినట్లు చెప్పారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. విజయవాడలో సీఎం జగన్‌కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని జానీ పాషా పేర్కొన్నారు. కాగా ప్రొబేషన్ ఖరారు చేసేందుకు అర్హులైన ఉద్యోగుల…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నన్ ఇచ్చింది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్,…
జగనన్న విద్యాదీవెన పథకం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో జమ అయిన ఈ సొమ్మును వారం, పది రోజుల్లో కాలేజీలకు విద్యార్థుల తల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో నిధులను నేరుగా కాలేజీలకే జమ…
అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో…
కరోనా మహమ్మారి ఎంట్రీ అయిన తర్వాత ప్రతీరోజు కరోనా కేసులు, రికవరీ కేసులు, యాక్టివ్ కేసులు.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా పూర్తి వివరాలు వెల్లడిస్తూ వస్తుంది వైద్య ఆరోగ్యశాఖ.. ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అంటే 24 గంటల పాటు నమోదైన వివరాలను బులెటిన్ రూపంలో విడుదల చేస్తూ వస్తోంది.. అయితే, ఇవాళ్టి నుంచి కరోనా బులెటిన్ ఇవ్వకూడదని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది… Read…
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదో ఒక చోట లీక్ అవుతూనే ఉన్నాయి. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనల్ని ఇంకా మరువకముందే.. మరోసారి కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ఫోన్లో ప్రత్యక్షం అవ్వడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Read Also: IMD: వాతావరణశాఖ చల్లని…