ఏపీని వరదలు వదలనంటున్నాయి. ఏపీపై యుద్ధం ప్రకటించినట్లుగా వెనువెంటనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28, 29 తేదీల్లో తిరుపతి, నెల్లూరు నగరాలలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Also Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..
సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాలతో తిరుపతిలో మునుపెన్నడూ చూడనటువంటి వరదలు సంభవించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలను రంగంలోకి దింపాయి.