నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారు.. అంటూ వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏలూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విజయవాడలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందన్నారు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.. ఏడాదిలో ఎంత వర్షం పడుతుందో అంత…
ఏలేరు వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం.. అన్ని రకాలుగా సన్నద్ధమైన విషయం విదితమే.. కాగా, ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.. నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని ఆదేశించారు..…
వరద సాయం ప్యాకేజీకి అవసరమైన నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. వరద సాయంపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది ఏపీ సర్కార్. వరద నష్టంపై అంచనా పనులు చేపడుతూనే.. జరిగిన నష్టాన్ని కేంద్ర పెద్దలకు వివరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం..
వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు..
ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్…
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వదర బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు.
వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళంపై సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. పాకెట్ మనీని వరద సాయంగా ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
Non Telugu Star Heros Silent on Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వలన ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడలో చిట్టినగర్, సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు ఉధృతంగా ఉంది. అక్కడి బాధితులకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఆకలి తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో…