లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాగా స్పందించే మనసు ఉండాలి అన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగింది.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారు.. కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు..
Ram Charan No To Travel AP Today: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వరదల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో వేలాది కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందిపడ్డారు. వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలించారు. ఈ పరిస్థితుల నుంచి తెలుగు ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు…
ఏపీలో వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి...అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు.
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వరదకు ఎఫెక్ట్ అయ్యారు. పవన్ ఇంటి స్థలం ఏలేరు వరద ముంపుకు గురైంది. పిఠాపురం వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ ఇంటి స్థలం నీట మునిగింది.
వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాకులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి దాతలు చెక్కులను అందజేశారు. మంత్రి నారా లోకేష్‌ను హీరో సాయి ధరమ్ తేజ్ కలిశారు. వరద సాయం కింద రూ.10 లక్షల చెక్కును మంత్రి లోకేష్‌కు సాయి ధరమ్ తేజ్ అందించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.
విజయవాడలోని విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి కండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు.