CM Flood Relief: మేము సైతం.. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ
- మేము సైతం..వరద బాధితులకు సాయం కోసం
- సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించిన పలువురు దాతలు
- సీఎం పిలుపునకు భారీ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Flood Relief: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వదర బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. దాతలకు సీఎం అభినందనలు తెలిపారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తిరిగి సాధారణ స్థితికి చేర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్న వారికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ విరాళం
ఏపీలోని వరద బాధితుల సాయం కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ విరాళం అందించింది. రూ. 5 కోట్ల చెక్కును మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్యలు కలిసి సీఎం చంద్రబాబుకు అందించారు. ఇప్పటికే వరద బాధితులకు మూడు రోజుల పాటు అల్పాహరం మధ్యాహ్నం, రాత్రి భోజనం మంచినీళ్ల బాటిళ్లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ అందించింది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేతలో మేఘా ఇంజనీరింగ్ యంత్రాంగం కీలకంగా వ్యవహరించింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Read Also: Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
జీఎంఆర్, ఏఐజీ హాస్పిటల్స్ విరాళాలు
సీఎంను కలిసి విరాళాలు అందించిన వారిలో…విశాఖపట్నానికి చెందిన జీఎమ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చల్లా ప్రసన్న, సీఈఓ మనోమేరాయ్ రూ.2.5 కోట్లు, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, వైస్ చైర్మన్ పీవీ ఎస్ రాజు రూ.1 కోటి(ఆన్ లైన్ ట్రాన్సాక్షన్), వెల్ జాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత వెలమాటి జనార్థన్ రావు రూ.1 కోటి చెక్కులను సీఎంకు అందించారు. మెప్మా తరపున ఐఏఎస్ తేజ్ భరత్ రూ.1 కోటి, ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ రూ.50 లక్షలు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్ ప్రవాస తెలుగువారు రూ.17 లక్షల 50 వేలు, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వవిద్యార్థి డాక్టర్ అమ్మన్న రూ.15 లక్షలు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షలు, ఎన్ఆర్ఐలు సురేష్ మానుకొండ, ఉప్పు వినోద్ బాబు, వరదా అమర్ రూ.10 లక్షలు అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి లలితా జ్యువెల్లర్ అధినేత కిరణ్‌కుమార్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రజలకు తమ వంతు సాయాన్ని అందించాలని ప్రజలకు సూచించారు. ఇప్పుడు సాయం చేయకపోతే ఎంత డబ్బున్నా వృథా అని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నుండి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్ కుమార్ రూ.6 లక్షలు, బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ యాజమాన్యం సూర్యదేవరబాబు-వెంకట రమా ప్రసాద్ రూ.5 లక్షలు, వల్లూరి రవీంద్రనాథ్, తేజ్, రూ.5 లక్షలు, మండపేట నియోజవకర్గం నుండి రైస్ మిల్లర్స్ తరపున రూ.5 లక్షలు, ఛాంబరాఫ్ కామర్స్ తరపున రూ.1.5 లక్షలు, రోటరీ క్లబ్ తరపున రూ.75 వేలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అందించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రూ.5 లక్షలు, బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ సంస్థ రూ.5 లక్షలు, ది అలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున రూ.5 లక్షలు సీఎంకు అందజేశారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రూ.4 లక్షలు, టి.సతిష్ రూ.3 లక్షలు, పాలడుగు పార్వతిదేవి రూ.3 లక్షలు, ప్రసాద్ నాయుడు రూ.2 లక్షల 116, గాంధీ-వసుమతి రూ.2 లక్షల 16లు, కొత్తపల్లి గాంధీ రూ.1 లక్ష, కెవిఎస్వీ ప్రసాద్ రూ.1 లక్ష, యలమంచిలి విమలాబాయ్ రూ.1 లక్ష, తోటకూర రాజారత్నం బాబు రూ.1 లక్ష, టి.కిషోర్ కుమార్ రూ.1,11,116లు అందించారు. గారపాటి శ్రీలక్ష్మీ రూ.1 లక్ష, పులి వెంకటేశ్వర్లు రూ.1 లక్ష, కె. ప్రభాకర్ రావు రూ.75 వేలు, కరణం పద్మజ బంగారపు ఉంగరం, దివ్యాంగుడు వి.బాబూరావు కెఆర్ జడ్పీహైస్కూల్ ఓల్డ్ స్కూడెంట్ రూ.50 వేలు, కరుసల శైలజా రూ.50 వేలు, ఏ.బాలాజీ ప్రసాద్ రూ.50 వేలు, జీఎన్.బీ.వీ.ప్రసాద్ రావు రూ.50 వేలు, చలసాని సుబ్బారావు రూ.40 వేలు, చలసాని భార్గవి రూ.32 వేలు, జి.సాంబశివరావు రూ.10 వేలు, ఆర్.రాధాకృష్ణ రూ.10 వేలు అందించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!