Good News: ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచింది సర్కార్.. 12 శాతం నుండి 16 శాతానికి హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) పెంచేశారు.. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల,రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట,…
Bopparaju Venkateswarlu: తమ డిమాండ్ల పరిష్కారంకోసం ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఇక సమస్య పరిష్కారం అయినట్టేనని చెబుతున్నా.. అవి కార్యరూపం దాల్చేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు.. 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నాం.. న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం కొనసాగిస్తామన్నారు.. ప్రభుత్వం నిన్నటి వరకు చర్చలు జరపకుండా లాస్ట్ మినిట్‌లో పిలిచి అనధికారిక చర్చలన్నారు.. చర్చలకు…
Good News to Employees: ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే…
Botsa Satyanarayana: అమరావతి సచివాలయంలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. 62 ఏళ్ళకు పదవీ విరమణ అంశాన్ని గురుకుల టీచర్లు, కార్పొరేషన్లకు కూడా అమలు చేయాలని ఉద్యోగులు కోరారని.. న్యాయపరమైన చిక్కులు లేని సందర్భంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పామని మంత్రి బొత్స చెప్పారు. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగులను పిలవలేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమాచారం సీపీఎస్ భేటీగా…
Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే…
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు.…
Botsa Satyanarayana: ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని..…
CPS Employees: సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు ఓ ప్రకటన జారీ చేశారు. APCPSEA ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1వ తేదీన శాంతియుత ర్యాలీ, సభల ద్వారా సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామని తెలిపారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు ప్రతిసారి పోలీసు అనుమతి తీసుకుని నిర్వహిస్తూ వచ్చామని.. అలాగే సెప్టెంబర్ 1న చలో విజయవాడ పేరుతో నిర్వహించబోయే…