Bopparaju Venkateswarlu: తమ డిమాండ్ల పరిష్కారంకోసం ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఇక సమస్య పరిష్కారం అయినట్టేనని చెబుతున్నా.. అవి కార్యరూపం దాల్చేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు.. 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నాం.. న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం కొనసాగిస్తామన్నారు.. ప్రభుత్వం నిన్నటి వరకు చర్చలు జరపకుండా లాస్ట్ మినిట్‌లో పిలిచి అనధికారిక చర్చలన్నారు.. చర్చలకు విలువ లేదని వారే చెప్పారని వ్యాఖ్యానించారు. ఇక, డీఏలు కూడా 1-7-2018 నుండి నేటి వరకు సెటిల్ చేయలేదని.. ప్రభుత్వం వచ్చాక పీఆర్సీ ఇస్తామని నేటికి ఆ సమస్యలు అలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
డీఏ అరియార్, సరెండర్ లీవ్‌లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సంఘాలతో రౌండ్ టేబుల్ నిర్వహించామని తెలిపారు బొప్పరాజు.. కార్మిక సంఘాల మద్దతు అవసరం వుందని కోరామన్నారు.. ఏపీ జేఏసీతో కూడా గతంలో కలిసి పనిచేశాం.. త్వరలో మా ఉద్యమంలో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. రౌండ్ టేబుల్‌కు వచ్చిన అన్ని సంఘాలు ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలిపాయి.. రేపు గ్రామ, వార్డు సచివాలయం సమస్యలపై ధర్నాలు చేయాలని నిర్ణయించాం.. మహిళ కార్యదర్శులని చెప్పి.. ఇప్పుడు పోలీసులు అంటున్నారని తెలిపారు. ఇక, రేపు, ఎల్లుండి రాష్ట్ర సమావేశం నిర్వహించి ఆదివారం మా తుది ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు.