ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల సీట్ల వ్యవహారాలు సద్దుమణుగడం లేదు. పార్టీలో సముచిత స్థానం లభించలేదని కొందరు.. రాజీనామాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చి వేరే అభ్యర్థులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాజాగా.. ఉండిలో టీడీపీ శ్రేణులు రగులుతున్నారు.
పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో వైసీపీ ఫేక్ పరిశ్రమను తెర పైకి తెచ్చిందని ఆరోపించారు. వైసీపీ ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ.. ప్రజల్ని గందరగోళం సృష్టించాలని చూస్తోందని తెలిపారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం…
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంబటి తెలిపారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అంటున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మాటలు ప్రజలు నమ్మరు... నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్ చేస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.