ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆయన ఈ నెల 25వ తేదీన పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి కొనసాగుతుంది. ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ రెబల్స్ రెడీ అవుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్దిగా ముత్తుముల అశోక్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు మెడికల్ కళాశాల భూముల కొనుగోలులో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లు రుజువు చేస్తే పోటీ నుంచి విరమించుకుంటాను.. అలాగే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
వైసీపీ ఆభ్యర్థులను అత్యధిక మెజార్టితో గెలిపించాలి అని వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. అవినీతి లేకుండా చేసిన పాలనను ప్రతి రోజూ ప్రజలకు గుర్తు చెయాలి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త 30 రోజుల ప్రోగ్రాం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లాలి.. టీడీపీ - జనసేన- బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా వస్తున్నాయని ఆయన తెలిపారు.
రేపటి నుంచి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించారు.. ఇక, బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. ''స్వర్ణాంధ్ర సాకార యాత్ర'' పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు..
‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.