టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంబటి తెలిపారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అంటున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మాటలు ప్రజలు నమ్మరు… నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో నాలుక మడతేశారని ఆరోపించారు. వాలంటీర్ల పై, నీచమైన అపవాదులు వేశారని తెలిపారు. ఈరోజు వాలంటీర్లకు రూ. 10,000 జీతం ఇస్తామనటం మాయమాటలు చెప్పడం కాదా అని పేర్కొన్నారు. ఇది ఎన్నికల స్టంట్ కాదా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Read Also: Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ ఇండియా..
అసలు చంద్రబాబు మాటలు ఈ భారత దేశంలో ఎవరైనా నమ్ముతారా? మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాను ధైర్యంగా చెబుతాను వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేపించారు… చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలేడని దుయ్యబట్టారు. జరుగుతున్న సర్వేలు, వస్తున్న రిపోర్టులన్నీ వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయన్నారు. జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నాయి అని తెలిపారు. చంద్రబాబు ఒక మేనిప్లేటర్, ప్రజా నాయకుడు కాదని ఆరోపించారు.
Read Also: Rohith Sharma: స్టేడియంకు కారులో ఆకాష్ అంబానీతో పాటు రోహిత్ శర్మ.. కొత్త ట్విస్టులు ఏం లేవుగా..?!