విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామానికి చెందిన వాలంటీర్ నత్త విజయ్ సాగర్ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ధూళిపాళ్ల దేవేందర్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో వారి కార్యాలయంలో బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అదే గ్రామానికి చెందిన 35 ఎస్సీ కుటుంబాల నాయకులు, కార్యకర్తలు నత్త ఆనంద్ సాగర్, బొనిగె బుజ్జిబాబు, దోమ జోసఫ్, కంబ సామెల్,…
పోతిన మహేష్ ఇప్పుడు ఏ చేయి నరుకుంటావు? అని ప్రశ్నించారు కిరణ్ రాయల్.. కొబ్బారికాయల కత్తి నీకు మా కార్యకర్తలు కొరియర్ చేస్తారని పేర్కొన్నారు. జనసేన వల్ల నువ్వు నాయకుడు అయ్యావు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు. ఎంత తీసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బురద చల్లావో అందరికి తెలుసు అని దుయ్యబట్టారు.
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. ఇటీవలే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు..
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి కాకర్ల మస్తానమ్మ, అత్త కడియాల పద్మావతి, మామ కడియాల వెంకటేశ్వర్లు కలిగిరి మండలం లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.