బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్కి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. మంకమ్మ తోట నుంచి రాంనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి గంగుల, ఎంపీ అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే హరీష్ రావు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్లో చదువుకున్న విద్యార్ధిని నేను.. జరిగిన అభివృద్ధి చుస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవన్నారు. బీఆర్ఎస్కు…
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
కడప జిల్లాలోని పులివెందులలో వైసిపి బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు రెండు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఇప్పటికే వారి అభ్యర్థులను ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో రాజకీయ సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం పార్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. Also read: Elections 2024: విజయనగరం…