గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నానన్నారు. సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య అని వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని భావిస్తున్నామని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని తన అనుమానమని ఆయన అన్నారు.
హైదరాబాద్లోని బి.ఎన్ రెడ్డి నగర్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వలసవాసులు అపూర్వ స్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య యువత, ఆడపడుచులు బి.ఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకర్ల సురేష్ కు మేమున్నాము మీకు అని ధైర్యాన్ని నింపి మా అందరి ఓటు సైకిల్ గుర్తు మీద మా పవిత్రమైన ఓటు…
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చిన అజెండా ఒకటేనని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పరిరక్షణ అలాంటి పాలన రావాలంటే సైకో పోవాలి.. కూటమి గెలవాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి అని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు. ఈ రాష్ట్రంలో…
శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి జీవిమాను కూడలిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర బహిరంగ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబాయిని చంపుకుని ఇతరుల మీద నెట్టి అధికారంలోకి వచ్చిన సైకో జగన్. అలాంటి సైకోని గెలిపించి అనుభవిస్తున్నారు అని ఆరోపించారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) నాటికి సంబంధించిన షెడ్యూల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.