Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతుంది.. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో తమ మార్క్ రాజకీయాలు చేస్తున్నారు నేతలు.. అయితే, ఈ రోజు నుంచి నటసింహ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధం అయ్యారు.. కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించి… ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.. అయితే, ఎన్నికల ప్రచారానికంటే ముందే తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు బాలయ్య.. శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ.. చేయి కూడా చేసుకున్నారు.
Read Also: Manchu Lakshmi: మంచు లక్ష్మి కొత్త ఇంటిని చూశారా?.. అదిరిపోయింది అంతే..
బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు ఓ అభిమాని.. బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు.. గుమ్మిగూడి జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.. ఈ సమయంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ చేయి చేసుకున్నారు.. అయితే, నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.. దీని కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న బాలయ్య.. ఆ తర్వాత తన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టన్నారు. కాగా, ఇప్పటికే బాలయ్య పలు సందర్భాల్లో తన ఫ్యాన్స్‌పై చేసుకున్నారు.. సింపుల్ వచ్చి.. రిక్వెస్ట్‌గా సెల్ఫీ, ఫొటోలు అడిగితే కూల్‌గానే స్పందించే బాలయ్య.. ఎవరైనా తన దగ్గరకు వచ్చి అతిచేస్తే మాత్రం.. వెంటనే సీరియస్‌గా స్పందించే విషయం విదితమే..