CM YS Jagan: రాజకీయంగా మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో మాట్లాడిన ఇక్కడ చేనేత మహిళకు టికెట్ ఇచ్చాను అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఏపీ: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని హెచ్చరించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలన్న ఆయన.. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీకి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు ఫ్యామిలే పోటీ చేస్తోందని మండిపడ్డారు.
ఇక, చేనేత రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు చంద్రబాబు.. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడ కూడా బీసీలకు టికెట్ ఇవ్వరు.. కానీ, తమ పార్టీ 100 స్థానాల్లో బడుగు, బలహీన వర్గాలకు టికెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడని తెలిపారు.. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదని వ్యాఖ్యానించారు.. మంగళగిరి వైసీపీ అభ్యర్థి గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లావణ్య దగ్గర లేదు.. వాళ్లు ఓటుకు రూ.4వేలు కూడా ఇస్తారన్నారు. ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.
54 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం.. ఇళ్లు ఇవ్వాలని నిర్ణయిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లారు.. పేదలకు ఇళ్లు ఇస్తామంటే అడ్డుకున్నదెవరు? అంటూ మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా? అని నిలదీశారు.. ఇక, నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేదని ఆరోపించారు సీఎం వైఎస్ జగన్..