గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చిన అజెండా ఒకటేనని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పరిరక్షణ అలాంటి పాలన రావాలంటే సైకో పోవాలి.. కూటమి గెలవాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి అని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్న కేంద్రం సహకారం కావాలని.. అందుకే రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా త్యాగాలు చేసాం… ప్రజల కోసం జట్టు కట్టామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని చంద్రబాబు కోరారు.
Ram Charan: మా అమ్మ నమ్మలేదు.. నాకు దక్కిన ఈ గౌరవం వారందరిదీ!
మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో భూమి విలువ తగ్గిపోయింది.. కొనేవాడు లేడు.. అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదు.. ఈ సీఎం అభివృద్ధి చేయడని విమర్శించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఒక్క అమరావతి వచ్చి ఉంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవని పేర్కొ్న్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది.. ప్రజలకు ఆదాయం పెరిగేది, కొనుగోలు శక్తి పెరిగేదని తెలిపారు. కానీ.. సీఎం జగన్ అమరావతిని సర్వనాశనం చేశాడని.. ప్రభుత్వ ఆదాయానికి నాలుగు లక్షల కోట్లు నష్టం చేశాడని వ్యాఖ్యానించారు.
Iran-Israel Tensions: ఇరాన్ సీజ్ చేసిన ఇజ్రాయిల్ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది..
ఒక్క నెల టైం ఉంది.. మే 13న జరిగే ఎన్నికలలో జగనాసుర వధ జరుగుతుందని చంద్రబాబు విమర్శించారు. అమరావతి మన రాజధాని, విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని, కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేస్తాం… ఇది తన బాధ్యత అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్మి, అరవై రూపాయల క్వార్టర్ బాటిల్ ను రెండు వందలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మందుతో ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది… ప్రజల రక్తం తాగే జలగ జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక దొరకదు.. ఒకప్పుడు 1000 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 6000 అయ్యిందని చంద్రబాబు ఆరోపించారు.