ఒంగోలు లోక్ సభ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తు్న్న ఆయన.. ఈ రోజు బేస్తవారిపేటలో ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎన్నికల తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి గానీ, నాయకులు గానీ.. మా గ్రామంలోకి రావొద్దు అని హెచ్చరిస్తూ మాగపువారిపేట గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం మాగపువారిపేటలో ఈ వార్నింగ్ ఫ్లెక్సీలు కలకలం రేపుపుతున్నాయి.
మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) నేతలు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, ఇతర పార్టీ నేతలతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి తమ ఫిర్యాదులను స్వీకరించింది. ముఖ్యమంత్రిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు, ఎన్నికల సంఘాన్ని సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశం…
ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు Clలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్లు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే.. CM జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ…
రాళ్ళ దాడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ తిరుపతిలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి పేరు కోసం టిడిపి వారే శ్రీ వైఎస్ జగన్ పై రాళ్ళు విసిరారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే రాయి సీఎంకు తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కి తగిలిందని, అయన కూడా కంటికి చికిత్స తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతీ…