తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేపట్నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కానున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే... ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందించారు. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ స్థానాలకు పవన్ బీ ఫారాలు అందించారు. తొలి బీ-ఫారం నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు. రేపట్నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ-ఫారాలు అందించారు జనసేనాని పవన్‌కళ్యాణ్.