అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.
ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని.. రేపు సెక్షన్ 30, 31 నోటీసు ఇస్తామన్నారు. ఫారం - 1 పబ్లిక్ నోటీసుపై రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారని.. రేపు ఉదయం 11 గంటల నుంచీ నామినేషన్లు స్వీకరించడానికి సంసిద్ధం చేసుకుంటారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సపోర్టుగా షాకింగ్ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈసారి రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఓటమికి తప్పదన్న ఆ సర్వే రిపోర్ట్ లో వెల్లడైందని పుత్తా ఫ్యామిలీ తెలిపింది.
ప్రభుత్వ సలహాదారులకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందుతున్న వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని పేర్కొంది..