కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు.
రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
భవన నిర్మాణ కార్మికులుగా వివిధ పనులు చేస్తూ జీవనం సాగించే సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.
గొర్విమానిపల్లి ప్రస్తుత ఎంపీటీసీ పులి ప్రకాష్ రెడ్డితో పాటు అతని సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు వార్డు మెంబెర్లు, కీలక నాయకులు, కార్యకర్తలు బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి సింబల్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా ఈ గుర్తును జనసేన పార్టీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, తీర్పు రిజర్వ్ చేసింది. నేడు జనసేన…