Memantha Siddham Bus Yatra: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ రోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. రేపు మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు.. విజయవాడలో తనపై రాయి దాడి జరిగినా.. నుదిటిపై గాయం మానకపోయినా.. బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం.. ఇక, 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. రేపు అనగా గురువారం ఉదయం 9 గంటలకు తేతలిలో రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయల్దేరతారు సీఎం జగన్.. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకోనున్నారు..
Read Also: CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..
ఇక, ఆ తర్వాత కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురంలో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే మేమంతా సిద్ధం యాత్రతో 16 జిల్లాలు, 49 నియోజకవర్గాలను చుట్టేశారు సీఎం జగన్.. 1636 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు.