ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్(CCC)ను ఏర్పాటు చేసింది ఈసీ. ఈ క్రమంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఈఓ ఎంకే మీనా పరిశీలించారు. ఏపీలో నిరంతర నిఘా కోసం CCC ఏర్పాటు చేశారు. ఎంసీసీ ఉల్లంఘనలు, నగదు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై CCC నుంచి నిఘా ఉంటుంది. అంతేకాకుండా.. వెబ్ కాస్టింగ్ ద్వారా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల్లో వాహనాల కదలికపై పర్యవేక్షణ ఉంటుంది.
ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. అతిరథ మహారధులు వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా.. అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.
ఏపీలో ఎన్నికలు రచ్చ రేపుతున్నాయి. వేసవిలో ఎండకంటే.. రాజకీయాల వేడి ఠారెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎండిఓ కార్యాలయంలో ఉన్న ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.…
నెల్లూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం నా జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు.
భారీగా తరలి వచ్చిన అశేష జనవాహనితో పెదకూరపాడు జనసంద్రంగా మారింది. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు.
టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపిందట.. దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు టాక్ వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.