10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద 19 లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను మోహరించింది. నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పరిశీలకులు, మానిటరింగ్ బృందాలను నియమించారు. దేశంలో మొదటి మూడు దశల్లో ఓటింగ్ జరిగింది. మొదటి మూడు దశల్లో వరుసగా 66.14శాతం, 66.71శాతం, 65.68శాతం ఓటింగ్ శాతం నమోదైంది.
జమ్మలమడుగు పట్టణంలోని 116, 117 పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సర్వే పరిశీలించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయం కాగా.. వైసీపీ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని డి నేలటూరు పోలింగ్ స్టేషన్ నందు విద్యుత్తు అంతరాయంతో ఈవీఎం లలో గుర్తులు కనిపించడం లేదని ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాదిమంది ఓటర్లు వేచి చూస్తుండగా విద్యుత్ అంతరాయం కలిగింది. సంబంధిత అధికారులు విద్యుత్ సరఫరా అందించగలరని ఓటర్లు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షంతో విద్యుత్ సరఫరా అందించలేని స్థితిలో విద్యుత్ అధికారులు ఉండగా.. ఓటర్ల ఎదురుచూపుతో అధికారులు కనికరించారు. అనంతరం ఓటింగ్ కొనసాగింది.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. మల్లమ్మ సెంటర్‌లో టీడీపీకి చెందిన బోలోరో వాహనాన్ని తగలబెట్టిన వైసీపీ శ్రేణులు తగులబెట్టినట్లు తెలిసింది. నరసరావుపేట ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ భర్త పాలడుగు దుర్గాప్రసాద్ కారు ధ్వంసం చేశారు. టీడీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ కారుపై గుంటుపల్లి జడ్పీ హైస్కూల్ వద్ద దాడి చేశారు. ఓటింగ్ కు వచ్చిన సమయంలో కొంతమంది వచ్చి కారు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు తీసుకోవడంతో సద్దుమణిగింది. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్‌లో నిల్చున్న వారికి.. సమయం ముగిసినా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. అతి సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 5 గంటలకు ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.. అయితే, 6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు.. ఇప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. సాయంత్రం 5 గంటల వరకే దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. పోలింగ్ పూర్తి అయ్యే సరికి ఓటింగ్ శాతం మరింత పెరగనుంది.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలు 94, 95 బూతులు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. పోలింగ్ బూత్ లోకి తన అనుచరులతో వచ్చారంటూ ఆదిమూలపు సురేష్‌ను అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు.. పోలింగ్ బూత్ లోకి సురేష్ ఒక్కరే వెళ్లాలని పోలీసులు సూచించారు.. అయినా.. తన అనుచరులతో పోలింగ్ బూత్ లోకి ఆదిమూలపు సురేష్ వెళ్లారని.. ఆ పోలింగ్ బూత్ కి వద్దకి చేరుకున్నారు టిడిపి నేత దామచర్ల సత్య.. దీంతో.. టిడిపి-వైసిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు
తెనాలిలో ఎమ్మెల్యే పై చేయి చేసుకున్న వివాదంలో గొట్టిముక్కల సుధాకర్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. క్యూలో ఉండి ఓటు వేయమని అన్నందుకే నాపై ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ దాడి చేశాడు.. శివకుమార్ అనుచరుల దాడితో నేను పోలింగ్ బూత్ లో దాక్కోవాల్సి వచ్చింది.. నేను సామాన్య పౌరుడిని, నన్ను రక్షించవలసిన వాళ్లే నాపై దాడి చేశారు.. నాకు పోలీసులు రక్షణ కల్పించాలి , న్యాయం చేయాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో.. కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక, పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు సీఈవో ముకేష్ కుమార్ మీనా
అల్లూరి జిల్లాలోని పెదబయలు మండలం తమలం, కోరజంగి, కంచురాయి గ్రామాలలో ఎన్నికలు బహిష్కరించారు స్థానికులు.. ఇప్పటి వరకు ఓటు వేయడానికి వెళ్లలేదు సుమారు రెండు వందల మంది గ్రామస్తులు.. అధికారులు వచ్చి తమ గ్రామాల అభివృద్ధికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది.. అంటే ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. ఆరు గంటల్లో 40.26 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. తర్వాతి స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ రికార్డ్ అయ్యింది.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం మేర పోలింగ్ పూర్తి అయ్యినట్టు అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ క్రమంగా పెరుగుతోంది.. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 36 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.. 36.84 శాతం మేర ఓటేసిన మహిళలు.. 35.03 శాతం మేర ఓటేసిన పురుషులు.. ఇప్పటి వరకు ఓటేసినవారి సంఖ్య చూస్తే కోటిన్నర దాటింది..
మాచర్ల 216, 205, 206, 207 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిలిచిపోయింది.. ఈవీఎంలను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారు.. దీంతో.. పోలింగ్ నిలిపేసి భయంతో బయటకు వెళ్లిపోయారు సిబ్బంది... ఈ ఘటనను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల సిబ్బంది.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడింది.. గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద.. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు మధ్య తోపులాట జరిగింది... అటు వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఇటు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారి వారి కార్లలో ఉండగా.. రోడ్డుపై ముస్తాబాద్ ఫ్లై ఓవర్ వద్ద ఘర్షణ జరిగింది.. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్న కార్యకర్తలు.. ఇరువర్గాలను సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు..
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సిట్టింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుపై దాడి చేశారు.. ఎంపీ కాన్వాల్ లోని మూడు కార్లు ధ్వoసం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.. అల్లూరి జిల్లా-18.61, అనకాపల్లి-19.75, అనంతపురం-23.90, అన్నమయ్య-22.28, బాపట్ల-26.88, చిత్తూరు-25.81, అంబేద్కర్ కోనసీమ-26.74, తూర్పు గోదావరి -21.75, ఏలూరు-24.28, గుంటూరు-20.84, కాకినాడ-21.26, కృష్ణా-25.84, కర్నూలు-22.05, నంద్యాల-27.19, ఎన్టీఆర్ జిల్లా-21.39, పల్నాడు-23.25, పార్వతీపురం మన్యం-15.40, ప్రకాశం-23.89, నెల్లూరు-23.77, శ్రీసత్యసాయి-20.61, శ్రీకాకుళం-21.37, తిరుపతి-22.66, విశాఖ-20.47, విజయనగరం-23.21, ప.గో-23.26, కడప-27.02 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 11 గంటల వరకు 24 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. అందులో 24.17 శాతం మేర మహిళలు ఓటుహక్కు వినియోగించుకుంటే.. 23.68 శాతం మేర పురుషులు ఓటేశారు... ఇప్పటి వరకు సుమారు కోటి మంది ఓటర్ల పోలింగ్ నమోదు అయ్యింది.
కాకినాడ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత.. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు లేరని.. దీంతో, జనసేన తరపున ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఆమె.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీలోని భోజరాజుపురానికి చెందిన వాసులు ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నారు.. బీఎల్ఓ అందించిన ఓటర్ స్లిప్ లను సైతం గ్రామస్తులు తీసుకోలేదు.. తమ సమస్యలపై ఇదివరకే కలెక్టర్ కి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు గ్రామస్థులు.. ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోడంతో.. తమ సమస్యలకు న్యాయం జరగలేనప్పుడు, ఎన్నికల్లో పాల్గొని ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు..
కృష్ణా జిల్లా గన్నవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. బాపులపాడు జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన-వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు.. జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోపవాదనలు.. సర్ది చెప్పి పంపిన పోలీసులు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్తులు.. ఏ పార్టీ నాయకులూ తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదంటూ.. పోలింగ్ బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు గ్రామస్తులు .. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ పోలింగ్ లో పాల్గొనబోమని వెల్లడి
ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.. ఉమ్మడి కడప జిల్లాలో చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం.. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఉంది.. మొబైల్ పార్టీలతో పర్యవేక్షణ ఉంది.. ఎక్కడ ఘటన జరిగినా మా సిబ్బంది క్షణాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేశామని ఎన్టీవీతో తెలిపారు డీఐజీ విజయరావు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ అగ్రహారం పోలింగ్ స్టేషన్ 23లో ఈవీఎం మొరాయించింది.. దీనిపై టెక్నీషియన్ కు సమాచారం అందించారు అధికారులు.. అయితే, గంట నుండి పోలింగ్ ఆగిపోవడంతో.. కొందరు ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
ఉదయం 9 గంటల వరకు అనంతపురం జిల్లాలో 9.17 శాతం పోలింగ్ నమోదు కాగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో 6.92 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గంట ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్.. పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. హిందూపురంలో వైసీపీ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. రెండు వాహనాలు ధ్వంసం. ఇద్దరికీ గాయాలు. గుత్తిలో వైసీపీ - టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం, తోపులాట..
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.. ఉదయం 9 గంటల వరకు అనకాపల్లిలో 11.60 శాతం, ఎలమంచిలిలో 6.91 శాతం, పాయకరావుపేటలో 6.97 శాతం, నర్సీపట్నంలో 6.68 శాతం, చోడవరంలో 7.92 శాతం, మాడుగులలో 11 శాతం, పాడేరులో 5.60 శాతం, అరుకులో 7 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
విశాఖపట్నం పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.. ఇప్పటి వరకు భీమిలిలో 7.91 శాతం, విశాఖ ఈస్ట్‌లో 9.40 శాతం, విశాఖ సౌత్ లో 4.83 శాతం, విశాఖ నార్త్ లో 13 శాతం, విశాఖ వెస్ట్ లో 11.20 శాతం, గాజువాకలో 17.23 శాతం, పెందుర్తిలో 6.59 శాతం పోలింగ్ నమోదు కాగా.. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో 10.76 శాతం పోలింగ్ నమోదు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది.. అత్యధికంగా గాజువాక నియోజకవర్గంలో 19.1 శాతం పోలింగ్.. అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్ నమోదు అయినట్టు ఈసీ ప్రకటించింది.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పోలింగ్ జరిగింది.. గురజాలలో 9.5 శాతం.. మాచర్లలో 9 శాతం.. పుంగనూరులో 15 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఏపీలో ఇప్పటివరకు 9.05 శాతం పోలింగ్ నమోదు. తొలి రెండు గంటల్లో కడప జిల్లాలో 12.04 శాతం పోలింగ్ నమోదు. చిత్తూరు జిల్లాలో 11.84 శాతం పోలింగ్ నమోదు. బాపట్లలో 11.36 శాతం పోలింగ్ నమోదు. కృష్ణా జిల్లాలో 10.80 శాతం పోలింగ్ నమోదు. నెల్లూరు జిల్లాలో 10.24 శాతం పోలింగ్.
నెల్లూరు జిల్లా కందుకూరులో పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు. 103, 125, 130, 135 బూత్‌లలో ఇంకా ప్రారంభంకాని పోలింగ్. అద్దంకి నియోజకవర్గం కుర్రవానిపాలెంలో 264 బూత్‌లో మొరాయించిన ఈవీఎం.
అన్నమయ్య జిల్లా రాజంపేట పుల్లంపేట (మం) దలువాయిపల్లిలో ఈవీఎంలను పగలగొట్టిన దుండగులు.. నిలిచిపోయిన పోలింగ్..
వైయస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని, తన కుటుంబ సభ్యులతో కలిసి తూర్పు నియోజకవర్గం, 29, 30 బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత. దాచేపల్లి, అచ్చంపేట, గురజాలలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు, పలువురికి తీవ్రగాయాలు. ఘర్షణలపై ఆరా తీసిన ఈసీ. అవసరమైతే అదనపు బలగాలు తరలించాలని ఆదేశం. పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూడాలని ఆదేశం.
ప్రధాని నరేంద్రమోడీ మోడీ పిలుపునిచ్చిన విధంగా ఈ సారి ఎన్నికల్లో 400 స్థానాలు దాటుతామని బీజేపీ నేత సాక్షి మహరాజ్ అన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్, రాయ్‌బరేలీ మరియు వయనాడ్ నుంచి అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ వీరంతా ఎన్నికల్లో ఓడిపోతున్నారని చెప్పారు. ఉన్నావ్ నుంచి పోటీ చేస్తున్న సాక్షి మహరాజ్ ఓటేశారు.
#WATCH | Sakshi Maharaj says, "If PM Modi has said "400 paar", I think we will cross 400. Akhilesh Yadav from Kannauj, Dimple Yadav from Mainpuri, Rahul Gandhi from Raebareli & Wayanad and Owaisi from Hyderabad - all of them are losing elections." https://t.co/vDCrjmHAaH pic.twitter.com/c3Duvds8aA
— ANI (@ANI) May 13, 2024
ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళగిరిలోని లక్ష్మీ నగర్ కాలనీ 197 పోలింగ్ బూత్ లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్.
ఏపీలో కొన్ని చోట్ల మొరాయించిన ఈవీఎంలు. వేసవి కావడంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వృద్ధులు.
హైదరాబాద్ నుంచి మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరి కాసేపట్లో మంగళగిరిలోని లక్ష్మీ నగర్ కాలనీ 197 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్ కల్యాణ్.
ఏలూరు చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ దేశవరంలో తమ గ్రామ రోడ్డు సమస్య పరిష్కరించాలని, సమాధానం చెప్పే వరకు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు సమాచారం.
గ్రీన్ పోలింగ్ స్టేషన్‌లో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొండాయపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న నరసరావుపేట లోక్ సభ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.
నెల్లూరు రూరల్ పరిధిలోని కొండాయపాలెం నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి.
ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చిన చంద్రబాబు. జీఆర్ఎస్ఆర్ ఎంపీపీ స్కూల్లో ఓటు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేష్ సహా కుటుంబ సభ్యులు.
విజయవాడ నగరంలో గ్రీన్ పోలింగ్ స్టేషన్. గ్రీన్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరంలో 40 నిమిషాలు గా మొరాయిస్తున్న EVM లు. ఓటు వేయటానికి వచ్చి ఎదురు చూస్తున్న మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న కేశినేని చిన్ని
విజయవాడలో గుణదల లో ఓటు హక్కు వినియోగించుకున్న తూర్పు నియోజక వర్గం వైసీపీ అభ్యర్ధి దేవినేని అవినాష్.
వికలాంగుడినైనా తానే తన.ఓటు హక్కును వినియోగించుకున్నాను. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావాలి. ఇప్పటికే క్యూ లైన్ లలో సీనియర్ సిటిజన్ లు ఉన్నారు. వారిని నా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోని ఓటు వేయాలి. -సీఎం రేవంత్ రెడ్డి మామ పద్మానందరెడ్డి
కడప జిల్లా భాకరాపురంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్.
ఏపీలో జనజాతరను తలపిస్తున్న కొన్ని పోలింగ్ కేంద్రాలు. అరగంట ముందే పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చిన ఓటర్లు.
పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్. రెంటాల గ్రామంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ. పరస్పరం దాడులు చేసుకున్న బూత్ ఏజెంట్లు.