సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్…
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు.
ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది.
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న "తెలుగు జన విజయ కేతనం జెండా" సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు.
ఈ రోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా…
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.