టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడన్న ఆయన.. దానికి నిదర్శనం గుడివాడ సీటే అని వ్యాఖ్యానించారు.
వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు.
ప్రస్తుతం జరుగు (2024) సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో.. చేనేత వర్గాలైన కుర్నీ (నేసే), పద్మశాలిల పూర్తి మద్దతు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్‌కు ఉంటుందని ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.
టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ 'రా కదలి రా' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు.
ఏపీలో బీజేపీ రెండు రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని కీలక నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు.
ర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.