Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు కోసమే తాను సీఎంను అడిగాను అని, జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్‌కు అన్నీ చెబుతానని ఆయన పేర్కొన్నారు. జరిగేవన్నీ సీఎంకి చెబితేనే కదా అందరికీ తెలిసేదన్నారు. సీఎం ఉద్యోగుల సమస్యలు మొత్తం పరిష్కరిస్తారని ఈ సందర్భంగా బాలినేని వెల్లడించారు. మాగుంట కోసం చాలా పట్టుబట్టాను.. సాధ్యం కాలేదు.. సర్దుకు పోయానని ఆయన స్పష్టం చేశారు. సర్దుకుపోకుంటే ఇవాళ ఆయన పార్టీకి రాజీనామా చేశారు.. ఆయనతో పాటు నేను వెళ్లలేను కదా అంటూ వివరించారు.
Read Also: Clash Between YCP and TDP Leaders: మాచర్లలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
ఇవాళ ఆయనతో కలసి పక్కపక్కనే కూర్చుని కార్యక్రమంలో పాల్గొన్నా.. రేపు కొందరు చిలువలు పలువలు చేసి రాస్తారన్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా కలసి కార్యక్రమంలో పాల్గొన్నారని మాట్లాడుతారన్నారు. తనకు చిత్తశుద్ది ఉంది.. ఆ మేరకే రాజకీయాలు చేస్తానని మాజీ మంత్రి బాలినేని అన్నారు. రాజకీయాల్లో చిన్న తప్పు చేసినా సరిదిద్దుకోవటానికి ఏళ్లు పడుతుంది అని వైఎస్సారు చెప్పిన మాటలు తనకు గుర్తున్నాయన్నారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకూడదు.. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని ఆయన చెప్పిన మాటలే స్పూర్తి అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.