టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ 'సిద్ధం' సభ నిర్వహించనుంది. అందుకు సంబంధించి భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. శనివారం మేదరమెట్ల ‘సిద్ధం’ ఏర్పాట్లను మంత్రి విడదల రజని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు 'సిద్ధం' సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చలు అనంతరం.. ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు.. బీజేపీతో పొత్తు ఖరారైందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని చంద్రబాబు నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా…
పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం…
ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. తాడేపల్లిలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో వైసీపీ ముఖ్యుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం…
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలు చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారని అన్నారు.