Nagababu Social media post about alliance: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట సర్వాత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి టీడీపీ-జనసేన-జనసేన కూటమి కలిసి బరిలో దిగడం దాదాపు ఖాయం అయింది. సీట్ల లెక్కలు తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి,నటుడు నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు హాట్ టాపిక్ అవుతుంది. ఆలోచించాల్సిన సమయం కాదిది, నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయం, సందిగ్ధాల సమయం కాదిది, సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం, విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం.. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్, తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్.. నిర్లక్ష్యం వీడు, నిజాన్ని చూడు, నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు… సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు.
Manjummel Boys: ఆ ఘనత సాధించిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా రికార్డ్
నిజానికి ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరి, సీట్ల లెక్క కూడా తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని, కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయబోతున్నారని అంటున్నారు. మరోవైపు.. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది కానీ ఎంపీగా పోటీకి నాగబాబు ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. ఇక తాజా పోస్ట్ తో జన సైనికులను సంయమనం పాటించాలని నాగబాబు కోరినట్టు అర్ధం అవుతోంది.
ఆలోచించాల్సిన సమయం కాదిది,
నాయకుడి ఆదేశాలని ఆచరణలో పెట్టాల్సిన సమయం,సందిగ్ధాల సమయం కాదిది,
సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం,విమర్శ,విభేదాల సమయం కాదిది,విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం..
శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్,
తీర్చుకోవాల్సిన పగా… pic.twitter.com/jMipvgnVMT— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2024