ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం - జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు.
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వైశ్య బజార్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే జామియా మసీదులో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్ సాబ్ కాకర్ల సురేష్ చేత ప్రార్థనలు జరిపించారు. అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా కాకర్ల సురేష్ ఉండాలని ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ముస్లిం సోదరులను పరిచయం చేసుకున్నారు. వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో చంద్రబాబు, అమిత్ షా, పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి సేవ చేయడం కోసమే టీడీపీ - బీజేపీ- జనసేన మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. మోడీ, అమీత్ షా, నడ్డా, పవన్ కళ్యాణ్ కలిసి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు…
నెల్లూరు GGHలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాలన అందించే లక్ష్యంతో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ఆమె పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా..! సీఎం అంటే చీఫ్ మినిస్టరా..?అని ప్రశ్నించారు. సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా..? సీఎం అంటే చంద్రబాబు మనిషా..? సీఎం అంటే చీటింగ్ మనిషా..? అని ట్విట్టర్ వేదికగా కాపు వర్గాన్ని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం…