తెలుగుదేశంపార్టీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అయితే, పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదనలకు మూడు పార్టీ నేతల ఏకాభిప్రాయానికి వచ్చారు.. అందులో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.. ఇక, 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు రెడీ అయ్యింది..
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. గతంలో యువగళం పేరుతో తాడిపత్రికి వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశాడు లోకేష్.. మరలా లోకేష్ శంఖారావం పేరుతో తాడిపత్రికి వస్తున్నాడు అని ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి వరుసగా సైకిలెక్కుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా.. టీడీపీ, జనసేన, బీజేపీలు ( TDP- Janasena- BJP ) కలిసి పోటీ చేసి ఎంపీగా గెలిచినా అందరూ మోడీకే ఓట్లేస్తారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ఆరోపించారు.
నరహంతకుడు మోడీ అని చెప్పి ఇప్పుడు ఆయన చుట్టూ చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. 2014 ముగ్గురూ కటయ్యారు.. 2019లో విడిపోయారు.. జగన్ ను ఓడించాలానే లక్ష్యంతోనే మళ్లీ ముగ్గురూ కలుస్తున్నారు.. ప్రతి సర్వేలో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుందని వెల్లడవుతోంది..
రాబోయే ఎన్నికల్లో జనేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కాదు.. నా మీద కాకినాడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు.