నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.
న్నికలు ముందు చెప్పే మాటలు అధికారంలోకి రావడం కోసం కాదని, గెలిచాక ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. కనీస సౌకర్యాలకు నోచుకోని వారికి ఉపశమనం కలిగించే పనులు చేశారన్నారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది.
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది.
మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు.
గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు.