నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్‌లో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని స్వర్ణకారులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు.
రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.