కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కానూరులోని యార్లగడ్డ గ్రాండియర్ లో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురు నేతలు మాట్లాడుతూ.. యార్లగడ్డ గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తామని తెలిపారు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.
ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ సమావేశం కానుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్దులు. ఖరారు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. ఏపీలో స్థానాలు, అభ్యర్ధుల ఖరారు పై సుదీర్ఘంగా బీజేపీ నేతల మధ్య చర్చోపచర్చలు సాగాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్ కు గన్నవరం సీటు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టిక్కెట్ మార్పు చేశారు.
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్…
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాగి ఆలయంలో నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే అప్పుల లెక్కలు పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పరిమితికి మించి అప్పు చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో నింపారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ప్రజలు…
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.