Chandrababu: ఖరారు చేయాల్సిన ఎంపీ సీట్లపై టీడీపీ కసరత్తు.. వారికే ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఇంకా ఖరారు చేయాల్సిన ఎంపీ సీట్లపై కసరత్తు చేస్తోంది.. జనసేన-టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని కీలక స్థానాలు కోల్పోయిన ఆ పార్టీ.. ఓ వైపు నేతలను బుజ్జగిస్తూనే మరోవైపు.. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఎక్సైజ్ చేస్తోంది.. విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేయనుంది టీడీపీ.
ఈ నేపథ్యంలో.. విజయనగరం లోక్ సభ స్థానం తూర్పు కాపులకు కేటాయించే అవకాశం ఉంది.. శ్రీకాకుళం, అనకాపల్లి స్ఖానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయించిన టీడీపీ, బీజేపీ. విశాఖ టీడీపీ తరపున బరిలో నిలవనున్నారు కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి భరత్… విజయనగరం పరిధిలో రెండు లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు ఉండగా.. విజయనగరం సీటు తూర్పు కాపులకి తప్పదని భావిస్తున్నారు చంద్రబాబు. తెర మీదకు కళా, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు వస్తున్నాయట.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరును కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, ఒంగోలు, కడప పార్లమెంట్లలో రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఉండనుండగా.. అనంతపురం పార్లమెంట్ నుంచి బీసీకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.. మొత్తంగా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయా స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!