పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు.
త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నాను అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది.. నా భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయాను అని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ ఆయన సతీమణి కాకర్ల సురేఖ వింజమూరులోని బీసీ కాలనీలో శనివారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసి తగిన ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం అని కనుక బీసీలు అందరు ఐక్యంగా కృషి చేసి తెలుగుదేశానికి అండగా నిలవాలని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
పెమ్మసాని మాట్లాడుతూ.. అయితే, వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవి లాగే పవన్ కల్యాణ్ తన పార్టీని అమ్ముకుంటున్నాడు.. తమ్ముడు కల్యాణ్ ఎంపీగా పోటీ చేసి వేల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఆరోపించారు. ఇక, పవన్ తనకు ఒక్క సీటు ఇచ్చినా చాలనుకుంటాడు.. నాదెండ్ల మనోహర్‌కు సీటు లేదన్నా ఒకే అంటారంటూ సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి.. రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇక, వైసీపీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. టీడీపీ, జనసేన ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించే పరిస్థితి ఉందన్నారు.