Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) ఢిల్లీకి బయలుదేరతున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు ఢిల్లీ విమానానికి ప్రయాణం చేయి, 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మా అంచనా ప్రకారం 81 శాతం మేర పోలింగ్ నమోదు కావచ్చు అని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెటుతో కలుపుకుని ఇప్పటి వరకు సుమారుగా 79. 40 శాతం నమోదైనట్టు చెప్పొచ్చు.
కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 27 స్ట్రాంగ్ రూములు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశామన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచే సిన స్ట్రాంగ్ రూములను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది.. జీరో వైలెన్స్ గా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అచ్చంపేట మండలం వేల్పూర్ లో మరోసారి వివాదం చెలరేగుతుంది. నిన్న ( సోమవారం ) పోలింగ్ బూత్ దగ్గర గ్రామంలోని రెండు వర్గాల వారికి గొడవ జరిగింది.
ఈవీఎంల భద్రత కోసం మూడు అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు, సివిల్ పోలీసులు కూడా ఈవీఎంలకు భద్రతగా ఉంటారు.. ఈవీఎంల భద్రత గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. 26వ పోలింగ్ బూత్ లో తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణతో వివాదం చేలరేగింది.